14 March, 2026 | 2:24 PM

ఇరాన్ ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి

14-03-2026 12:49 PM
  1. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేను
  2. ఇరాన్ సైన్యం లొంగిపోతే మంచిది
  3. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదు
  4. అమెరికాను అడ్డుకునే శక్తి ఇరాన్‌కు లేదు 
  5. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడుల  చేస్తాం
  6. నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తాం

వాషింగ్టన్: హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ ను హెచ్చరించారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామని వివరించారు. అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా సైన్యాన్ని(American military) ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దేశాలను బెదిరించే పరిస్థితి ఇరాన్ కు ఉండకూడదన్నారు. ఇరాన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే మంచిదని సూచించారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేనని ట్రంప్ వెల్లడించారు.