14 March, 2026 | 4:22 PM

పఠాన్ చెరువులో జంట హత్యల కలకలం

14-03-2026 12:34 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా( Sangareddy district) పఠాన్ చెరులో జంట హత్యల కలకలం రేగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటీజెన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు భార్య, భర్తలను దారుణంగా కొట్టి చంపారు. హత్యకు గురైన వారిని భర్త సోమ్లా నాయక్(50), భార్య మాన్యమ్మ(45)గా గుర్తించారు. సోమ్లా నాయక్ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. మృతులను మహబూబాబాద్ జిల్లా గురుడు మండలం దొంగచింతతాండ వాసులుగా గుర్తించారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.