13 July, 2026 | 4:37 PM

Breaking News

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •  

మల్లన్న హుండి ఆదాయం రూ. కోటి 11 లక్షలు

29-03-2025 12:00 AM

చేర్యాల, మార్చి 28 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీలెక్కింపు శుక్రవారం జరిగింది. ఈలెక్కింపు రామకృష్ణ భజన సేవా సభ్యులు పాల్గొన్నారు. 21 రోజులకు గాను  రూ.  కోటి 11 లక్షల 96 వేల 965 రూపాయలు నగదురాగా,మిశ్రమ బంగారం 112  గ్రాములు, మిశ్రమ వెండి 9  కిలోల 200  గ్రాములు, విదేశీ కరెన్సీ 24 నోట్లు, మిశ్రమ బియ్యం 20 క్వింటాళ్లు లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామాంజనేయులు తెలిపారు.

ఈ లెక్కింపు అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పాలక మండల సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.