పోలీసుల హెచ్చరిక బేఖాతర్.. వాహనాలు సీజ్
మల్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం, మల్యాల గ్రామంలో నిబంధనలు అతిక్రమించి డీజే వినియోగించడంతో మల్యాల(Malyala police) పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్యాల గ్రామంలో25-09-2026 రాత్రి, శ్రీ గణేష్ నిమజ్జన( Ganesh immersion) శోభాయాత్రలో పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి డీజే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారిపై డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి అధిక శబ్దంతో రాత్రి నుండి తెల్లవారు జామున వరకు సౌండ్ సిస్టం నిర్వహిస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిన డీజే ఆపరేటర్లు పిల్లి శ్రీనివాస్ సామంతుల రాజులపై మల్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు వారి వద్ద ఉన్న రెండు డీజే సౌండ్ సిస్టమ్‌తో పాటు వాహనాలు సీజ్ చేశారు.డీజే నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే డీజే యజమానులు, నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ సందీప్ మల్యాల హెచ్చరించారు.