15 May, 2026 | 11:24 AM

లింగంపేటలో నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

15-05-2026 10:09 AM

భర్తతో, మృతి తో భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం

ఆత్మహత్య, యత్నం నుండి కాపాడిన గ్రామస్తులు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): నాటుతుపాకీతో ఓ యువకుడి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం లోని, లింగంపేట పోలీస్  నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం నాటుతుపాకీతో ఓ యువకుడి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

లింగంపేట పోలీస్  మోతె గ్రామంలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి మోతె ( మోతే ) గ్రామానికి చెందిన తిలిపితీయ ఇంద్రజిత్ సింగ్ (28) గురువారం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతిపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం.