1 September, 2026 | 11:56 AM

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన వ్యక్తి

01-09-2026 11:22 AM

కంగ్టి, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): కంగ్టి మండలం నాగూర్ (బి) గ్రామానికి చెందిన అవుటి బసప్ప కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు అవుటి బసప్పను అంబులెన్స్‌లోకి తరలించి, మార్గమధ్యంలో ప్రాథమిక వైద్యం అందిస్తూ నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.