1 September, 2026 | 11:46 AM

కమిషనరేట్ పరిధిలో 22 మంది సీఐల బదిలీలు

01-09-2026 11:14 AM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్వోలు, సిఐలుగా విధులు నిర్వహిస్తున్న 22 మందిని వివిధ చోట్లకు బదిలీ చేస్తూ నగర కమిషనర్ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఎస్. శ్రీనివాస్ ను స్టేషన్ ఘనాపూర్ ఎస్ హెచ్ వో గా, జీ.వేణు ను రఘునాధపల్లి సిఐగా, పి దేవేందర్ ను నర్మెట్ట సిఐగా, ఏ.ప్రవీణ్ కుమార్ పరకాల సీ ఐ గా, అనుముల శ్రీనివాస్ ధర్మసాగర్ ఎస్ హెచ్ వో గా, జీ. బాబులాల్ ఆత్మకూరు ఎస్ హెచ్ వో గా, ఆర్. సంతోష్ పర్వతగిరి సీఐ గా.. కే.శ్రీను ఎలుకతుర్తి సీఐగా వై. సంజీవరావు వర్ధన్నపేట సీఐగా బదిలీ అయ్యారు.