27 August, 2026 | 7:03 PM

చేపల వేటకు వెళ్లి.. నదిలో పడి మృతి

27-08-2026 04:45 PM

కౌటాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వర్ధ నదిలో పడి మృతి చెందిన ఘటన కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోస్రే రాందాస్‌ (34) కూలీ పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో తన మామ, కుమారుడితో కలిసి వర్ధా నదికి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో జారి పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.