15 March, 2026 | 7:18 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అక్రమ సంబంధానికి నిండు ప్రాణం బలి

10-01-2026 09:39 PM

గద్వాల: ఈనెల 4న గట్టు మండలం మొసల్ దొడ్డి శివారులో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య వివరాలు వెల్లడిండించారు. గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన తిమ్మప్ప అన్న భార్య సువార్తమ్మతో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహంతో అక్రమ సంబంధ కొనసాగుతుంది.

అక్రమ సంబందానికి తిమ్మప్ప అడ్డు వస్తుండటంతో అబ్రహం పథకం ప్రకారం ముసల్ దొడ్డి శివారులో తిమ్మప్ప, అబ్రహంలు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తిమ్మప్పను అబ్రహం రాయితో కొట్టి చంపి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున గట్టు ఎస్ఐ కెటిమల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా, అందులో భాగంగా శనివారం ఉదయం నిందితుడు అబ్రహంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గట్టు ఎస్ఐ కెటిమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.