calender_icon.png 11 January, 2026 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి

10-01-2026 09:42:35 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం పలువురు సదాశివ నగర్, అమర్ల బండ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు వాడు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మదన్ మోహన్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్ సభ్యులందరూ జట్టుగా కలిసి పని చేయాలన్నారు.

గ్రామ అభివృద్ధి కోసం సర్పంచులు తమ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యత అధికంగా పనిచేయాలన్నారు. గ్రామంలో రోడ్లు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వీధిలో వివిధ దీపాలు వెలిగేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.

గ్రామ అభివృద్ధికి సంబంధించి సర్పంచ్కు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు. నెలకు రెండుసార్లు గ్రామపంచాయతీ పాలకవర్గం మొత్తం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద ప్రజలకు మేలు జరిగేలా కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సదాశివ నగర్ మండలం, అమర్లబండ గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ...

* గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌లు తమ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

* సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఒక జట్టుగా కలిసి పనిచేయాలని అన్నారు.

* గ్రామంలో రోడ్లు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయాలని తెలిపారు.

* డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

* ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా చూడాలని అన్నారు.

* ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

* అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు.

* గ్రామాభివృద్ధికి సంబంధించి సర్పంచ్‌కు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

* గ్రామ పంచాయితీలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు.

* నెలకు రెండు సార్లు గ్రామ పంచాయితీ పాలకవర్గం మొత్తం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు.