బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

08-09-2026 | 06:30pm

కంగ్టి,(విజయక్రాంతి): మండలంలోని చౌకన్పల్లి గ్రామ(Chowkanpalli village) శివారులో బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కరంజి గ్రామానికి చెందిన నగేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.క్షతగాత్రుడికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి(Narayankhed Government Hospital)కి తరలించి చికిత్స కోసం అడ్మిట్ చేశారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు