25 March, 2026 | 2:08 AM

మండి బిర్యానీ వికటించి నలుగురికి అస్వస్థత

25-03-2026 12:00 AM

ఏఎస్ రావు నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

కుషాయిగూడ మార్చి 24:( విజయ క్రాంతి) నగరంలోని ఏఎస్ రావు నగర్లో ఉన్న ’డిలీసియస్ మండి’ హోటల్లో బిర్యానీ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గత మూడు రోజుల క్రితం జరగగా, బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం..

స్థానిక నివాసితు లైన ఉమేష్, రాధిక, నరసింహ మరియు నాలుగు సంవత్సరాల బాలుడు విహాల్ కలిసి సదరు హోటల్లో మండి బిర్యానీ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వారందరికీ వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యా యి. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని జమ్మిగడ్డలోని ఒక ప్రైవేట్ క్లినిక్కు తరలించారు.

మూడు రోజులుగా చికిత్స..

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా బాధితులు గత మూడు రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. చిన్నారి విహాల్ పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజ మాన్యం నిర్లక్ష్యం వల్లే నాసిరకం ఆహారం వడ్డించారని, అందుకే తమకు ఈ పరిస్థితి ఎదురైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులు స్పందించి సదరు హోట్ప చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.