calender_icon.png 23 October, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండు గర్భావతిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

23-10-2025 03:07:33 PM

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad) దహేగాం మండలం గెర్రె గ్రామంలో గిరిజన యువతిని ప్రేమ, కులాంతర వివాహం చేసుకున్నాడని 9 నెలల నిండు గర్భావతి తలండి శ్రావణి రాణిని అత్యంత క్రూరంగా హత్యచేసిన శివార్ల సత్తయ్యను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని తూనీ అనే గ్రామానికి చెందిన 8వ తరగతి అమ్మాయి పైన 60 ఏళ్ల ముసలోడు అత్యాచారం చేశారని ఆయన్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజుల డిమాండ్ చేశారు.

గురువారం ఆదిలాబాద్ లో నిందితుని దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజుల మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హత్యలను ఖండించారు.  విచారణ వేగవంతం చేయాలని, హత్య కేసులకు ఫాస్ట్-ట్రాక్ విచారణ జరపాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఐద్వా జిల్లా కమిటీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున, అధ్యక్షులు కోవే శకుంతల, జిల్లా కమిటీ సభ్యులు విజయ, పంచపూల, పోచ్చక్క తదితరులు పాల్గొన్నారు.