23-10-2025 04:20:57 PM
వలిగొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ అసమర్థత పాలనతోనే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం వలిగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను నెరవేర్చలేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కల్లాలలో, ఐకెపి సెంటర్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని అన్నారు. అదేవిధంగా పత్తి రైతులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని లేని యెడల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.