26 May, 2026 | 11:32 AM

మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

26-05-2026 10:48 AM

హైదరాబాద్: సీపీఐ (Communist Party of India)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి(Maoist Leader Narahari Surrender) మంగళవారం తెలంగాణ పోలీసుల(Telangana Police) ఎదుట లొంగిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగానే నరహరి లొంగిపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కేవలం ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. వార్త శేఖర్, ముప్పాల లక్ష్మణరావు (ఈయన భారత మావోయిస్టు ఉద్యమ వ్యవస్థాపక నాయకులలో ఒకరు, 'గణపతి'గా సుప్రసిద్ధులు). గత కొన్ని దశాబ్దాలుగా వీరిద్దరూ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఇద్దరు నాయకులు ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు.