26 February, 2026 | 2:11 PM

ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులు!

17-12-2025 12:23 AM
  1. సిర్పూర్ యు అడవుల్లో 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
  2. హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసుకు తరలింపు
  3. అరెస్టయిన వారిలో రాష్ర్ట కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు?
  4. ఎన్నికల వేళ ఏజెన్సీ ప్రాంతంలో కలకలం

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులు ఆశ్రయం కోసం రావడంతో పక్కా సమాచారంతో వారిని స్పెష ల్ పార్టీ పోలీసులు, ఏఎస్పీ చిత్తరంజన్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 16 మందిని అరెస్టు చేయగా.. అం దులో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఉన్నట్టు సమాచారం. మావోయిస్టులు అరెస్టు అయ్యారనే సమాచారంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలుక్కిపడింది.

కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌లో భాగం గా మావోయిస్టుల అంతానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ర్ట, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మావోయిస్టు పార్టీలోని బడా నేతలు లొంగిపోవడంతో పాటు పోలీసు బలగాల చేతిలో హతం కావడంతో మిగతావారు తల దాచుకునేందుకు స్థావరా లను మారుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాణహిత నది దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఓ దళం, ప్రవేశించి ఏజె న్సీ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకునేందుకు చూసినట్లు తెలుస్తున్నది.

పోలీస్ నిఘా విభాగం సమాచారంతో ఎస్పీ నితికాపంత్ ఆదేశాలతో ఏఎస్పీ చిత్తారంజన్, స్పెషల్ పార్టీ పోలీసులు సిర్పూర్ యు అడవుల్లో జల్లెడ పట్టారు. సోమవారం రాత్రి మావోయిస్టు స్థావరం కనిపెట్టి, 16 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అరెస్టయిన వారిలో మావోయిస్టు పార్టీ రాష్ర్ట కమిటీ కార్యదర్శి చొక్కారావు ఉన్నట్టుగా తెలుస్తున్నది. 9 మంది మహిళలు ఉండగా, ఏడుగురు పురుషులు ఉన్న ట్లు తెలిసింది.

అందులో నలుగురు డీసీ ఎం సభ్యులు ఉన్న ట్లు సమాచారం. వారి నుంచి ఏకే 47, 2 పిస్టళ్లతో పాటు మందు పాతరకు సంబంధించిన సామగ్రి లభ్యమైనట్లు తెలిసింది. పట్టుపడ్డ వారిని హైద రాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న ట్లు అధికారికంగా వెల్లడించలేదు.

34 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల, డిసెంబర్ 16: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని అమ లు చేస్తున్న పునరావాస  పథకం ‘నియాద్ నెల్లా నార్’ సత్ఫలితాలు ఇస్తున్నది. దీనిలో భాగంగా మంగళవారం ఏకంగా 34 మంది మావో యిస్టు దళ సభ్యులు బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగి పోయారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా, మిగతా వారు పురుషులు.

వీరు మావోయిస్టు పార్టీలో డీవీసీఎం, పీఎల్‌జీఏ కంపెనీ సభ్యులు, ఏఎంసీ, ప్లాటూ న్ సభ్యులు, మిలిషియా ప్లాటూన్ కమాండర్లుగా పనిచేశారు. లొంగిపోయిన వారికి పోలీసులు తక్షణ ఆర్థికసాయంగా రూ.50,000 చొప్పున అందజేశారు. వారంతా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు సహాయ సహకారాలు అందిస్తామని పోలీసులు భరోసానిచ్చారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని, మిగిలిన మావోయిస్టులు కూడా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.