calender_icon.png 18 December, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఊరు ఊరంతా నలభీములే..!

17-12-2025 12:00:00 AM

  1. గరిట పట్టారంటే ఘుమఘుమలే

సీతారాంపురం వంట మాస్టర్ల  ప్రత్యేకత

ఇదే వృత్తిలో దాదాపు 50 కుటుంబాలు

సహాయకులుగా మరో 100 మంది

మణుగూరు, డిసెంబర్ 16(విజయక్రాంతి) : చుట్టూ పచ్చని పంటలు పం డుతుంటే, ఆ గ్రామంలో ఆకలి కేకలు వినిపించేవి. వర్షాల్లేక పంటలు ఎండిపోయేవి. ఆహారం కోసం జీవితాలు అల్లాడిపోయేవి. అప్పుడే పరిష్కార మార్గం ఆలోచించారు. ఆకలి తీరాలంటే, ఆకలి తీర్చే ఆహారాన్ని వండటమే వృత్తిగా స్వీకరించారు ఆ గ్రామ యువకులు. శుభ కార్యాలకు వంట చేసే పనితో జీవితాలకు బాట వేసుకున్నారు.

ఏ ఊళ్లో అయినా ఒకరో ఇద్దరో వంట చేసేవారుంటారు. కానీ అక్షరాలా ఆ గ్రామంలో  సు మారు నలభై మందికి పైన వంట మాస్టార్లు ఈ వృత్తిలో కొనసా గుతున్నారు మరో వంద మంది సహాయ కులకు ఉపాధి కల్పి స్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అదే ఇప్పుడా గ్రామానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. నల భీముల చిరునామాగా మారిన సీతారాంపురం  గ్రామంపై విజయక్రాంతి అంది స్తున్న ఆసక్తికర కథనమిది..

ఇంట్లో శుభకార్యం ఉంటే  విందు ప్రధానం. అందుకోసం ఏఏ వంటలు చేయాలి, వాటిని రుచి, శుచిగా వండే వాళ్లు ఎక్కడ దొరుకుతారనే విషయంపై విస్తృతం గా చర్చించుకుంటారు. ఎందుకంటే శుభకార్యాన్ని ఎంత ఘనంగా చేసినా, భోజనాలు సరిగా లేకపోతే బంధు మిత్రుల నుంచి విమర్శలు తప్పవు. భోజనాల తర్వాత వంటలు బాగున్నాయని వచ్చిన వారు చెప్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు ఉండవు.

వంటలు రుచిగా ఉండటంలో వంట మా స్టర్ల పాత్ర కీలకం అలాంటివంట మాస్టర్లకు భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా, అశ్వాపురం మండలంలోని సీతారాంపురం  కాలనీ, గ్రా మం పెట్టింది పేరు. మంచి వంట మాస్టర్ కోసం మీరు ఆ ఊరికి వెళ్తే చాలు. అక్కడ ఇంటికో వంట మాస్టర్ ఉంటాడు. సహాయకులు కూడా అక్కడే ఉంటారు.. మీరు వెళ్లి మా ట్లాడుకుంటే సరిపోతుంది. మణుగూరు, అశ్వాపురంచుట్టుపక్కల సీతారాం పురం వంట మాస్టర్ల చేతి వంట తినని వాళ్లే ఉండరు. ఆ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే గరిట తిప్పాలి. వాళ్లు వండిన బగారన్నం మటన్తో తింటే మజానే వేరు. 

వంట మాస్టర్ లక్ష్మణరావు ఆరంభం...

ఈ వృత్తిలో గ్రామానికి చెందిన బెల్లి లక్ష్మ ణరావు అశ్వాపురంలోని హెవీ వాటర్   ప్లాంట్లో వంట మాస్టర్గా పని చేశారు.కొన్ని రోజుల తర్వాత ఆయన గ్రామానికి చెందిన కొందరు యువకులకు వంటలు నేర్పించా డు. అలా ఓ కుటుంబం నుంచి మరో కు టుంబం వంట వృత్తిలోకి ప్రవేశించారు. వారిలో 40 మందికి పైగా వంట మాస్టర్లు, 100 మందికి పైగా వంట సహా యకులు ఉండడం ఈ కాలనీకి గుర్తింపును తెచ్చింది. 

గరిట తిప్పితే ఆహా అనాల్సిందే..

వంట మాస్టర్ల ఊరుగా మారిన సీతారాంపురం కాలనీ యువకులు  కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వంట మాస్టర్లుగా గుర్తింపుపొందారు. కేంద్ర అణు ఇంధన సంస్థ, ఇస్రో, డీ ఆర్డీవో వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వంట మాస్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా తప్పని సరిగా ఒక వంట మాస్టారు ఉండటం విశేషం. ప్రస్తుతం దాదాపు 150 కుటుంబాల వారు  వంట వృత్తితో జీవనోపాధి పొందుతున్నారు.

సీజన్లో చేతి నిండా పని..గ్రామంలో దాదాపు పది శాతం మంది శుభకార్యాలకు వండే పనిలోనే స్థిర పడ్డారంటే ఆ వృత్తిని ఎంతగా వారు గౌరవించి జీవనాధారంగా మలుచుకున్నారో అర్థమవుతుంది. శుభకార్యాల్లో సీతారాంపురం వంట మాస్టర్లు వంట చేశారంటే, భోజనాలు బాగా నే ఉంటాయి.. రుచి విషయంలో చూడాల్సిన అవసరం లేదని అతిథులు భావిస్తారు. ఇప్పడు వారికి ఏటా దాదాపు 200 రోజుల వరకు పనిఉంటోందంటే, వంట అంత రుచిగా తయారుచేయడమే ప్రధాన కారణం.పెళ్లిళ్ల సీజన్లో  వారికి చేతినిండా పని దొరుకుతుంది.

పినపాక నియోజకవర్గంలోనే కాదు, చుట్టు పక్కల జిల్లాల్లో కూడా సీతారాంపురం  వంటలు చాలా ఫేమస్. గ్రామాల్లో శుభకార్యాల్లో అర్ధరపై మాస్టర్లు చేసేవంటల్లో చికెన్, మటన్, బగారా అన్నం తో పాటు చేప చాలా ఫేమస్. ఇక శాకాహారం వండడంలోనూ వీళ్లది అందేవేసిన చేయి.రిసెప్షన్, వివాహ వేడుకలు, పుట్టిన రోజులు, గృహ ప్రవేశాలు, శుభ, అశుభకార్యాలకు పసందైన వంటలను వండిస్తారు. గరిట పడితే వెజ్, నాన్ వెజ్ వంటలు ఘమ ఘమలాడాల్సిందే. ఏదైనా శుభకార్యానికి వంట చేసినట్లయితే రూ.3000 నుండి పది వేల వరకు డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఆర్థికంగా ఉన్న వారికి వారికి తగ్గట్టు గా డబ్బులు తీసుకుంటారు.