14 August, 2026 | 3:52 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి   •   సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి   •   హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష   •   గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం   •   రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.   •   నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: చాడ వెంకటరెడ్డి   •   ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం   •   సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే   •   జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన   •   వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు   •  

ఖరీఫ్ నాటికి మారేళ్లపాడు ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

25-04-2026 02:39 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు కాలువకు అనుబంధంగా నిర్మిస్తున్న మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేయాలని శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ సమీపంలో పనులను పరిశీలించిన ఆయన, అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. ఎండాకాలం అనుకూల సమయం కావడంతో పగలు–రాత్రి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

మే 1 నుంచి ప్రతిరోజు పనులపై నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఈతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సర్పంచులు సబ్కా పిచ్చయ్య, ఎనిక ఉషారాణి, మచ్చ నరసింహారావు, కోర్సా కృష్ణ, తేళ్లం నాగమణి, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.