రేగా కాంతారావుపై పోలీసులకు ఫిర్యాదు
25-04-2026 02:36 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో పోస్టులు చేసినట్లు ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






