3 July, 2026 | 11:08 AM

కేజేఎల్ పౌల్ట్రీ ఫారంలో వివాహిత ఆత్మహత్య

03-07-2026 10:28 AM

భిక్కనూర్, జూలై 3(విజయ క్రాంతి): భిక్కనూర్ గ్రామ పరిధిలోని కేజేఎల్ పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలోని నివాసంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నమ్‌ఖానాకు చెందిన శివ్లీ గిరి (20),  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న భిక్కనూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మార్వో సమక్షంలో చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో మృతురాలికి భర్త రాజ్‌కుమార్ తో 10 నెలల క్రితం ఇష్టంలేని  వివాహం జరగడంతో కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం కాలేదని వెల్లడించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎమ్మార్వో సమక్షంలో ఇన్‌క్వెస్ట్ నిర్వహించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఇన్‌క్వెస్ట్ వివరాలు, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని భిక్కనూర్ ఎస్‌హెచ్‌ఓ డి. ఆంజనేయులు తెలిపారు