మాట నిలబెట్టుకున్న సర్పంచ్
03-07-2026 10:47 AM
సొంతఖర్చూలతో ఆలయ నిర్మాణం
కూసుమంచి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఇచ్చిన మాటను పంచాయతీ సర్పంచ్ నిలపెట్టుకున్నాడు. ఆలయాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తానని మాటిచ్చిన సర్పంచ్, గెలిచిన తరువాత తక్కువ టైమ్ లోని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కూసుమంచి మండలంలోని లింగరాంతండా సర్పంచ్ బానోతు పుష్ప రవి సొంత ఖర్చులతో శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట, 140 మంది మహిళలకు చీరాల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు చీరలను పంపిణి చేశారు.దీంతో గ్రామస్థులు సర్పంచ్ దంపతులను అభినందించారు . ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుగులోత్ వేణు, పాలక వర్గం, నాయకులు,గ్రామ పెద్దలు,మహిళలు, యువత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






