తిప్పారం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం
22-06-2026 03:34 PM
కొండపాక,(విజయక్రాంతి): కుకునూరు పల్లి మండలం తిప్పారం ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ బచ్చలి సత్తయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి గుణాత్మక విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు నోటు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు పంపించి డబ్బులను వృధా చేసుకోకూడదని ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన బోధన లభిస్తుంది అన్నారు.






