6 April, 2026 | 3:44 AM

టీఆర్పీలో భారీగా చేరికలు

06-04-2026 02:01 AM

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణ కుర్ని (నేసే) వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.జి.కే. వెంకటేశ్వరరావు ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధనలో డా. వెంకటేశ్వరరావు అనుభవం, సేవలు పార్టీకి మరింత బలాన్ని తీసుకువస్తాయని పేర్కొన్నారు. డా. పి.జి.కే. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు తనను ఆకట్టు కున్నాయని తెలిపారు.

జనగామ, యాదాద్రి జిల్లా అధ్యక్షుల ఎన్నిక..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నూతన అధ్యక్షులుగా కిలాషాపూర్ గ్రామానికి చెందిన కట్ల సదానందం నియమితులయ్యారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. కట్ల సదా నందం మాట్లాడుతూ..

నాపై నమ్మకంతో జిల్లా బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుధాగాని హరిశంకర్‌గౌడ్, మాదం రజని కుమార్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా కొమిరిశెట్టి నర్సింహులును నియమించారు. పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామక పత్రం అందజేశారు.