ఎంబీటీ ప్రతినిధులతో మల్లన్న భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం మజ్లిస్ బచావో తహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్, అలాగే తెలంగాణ మైనారిటీస్ జాగృతి సమితి (టీఎంజేఎస్) స్థాపకుడు, అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ జబ్బార్ రషీదితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమా వేశం అమ్జెద్ ఉల్లా ఖాన్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాల పై విస్తృతంగా చర్చించారు.
మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలు, రాజకీయ పార్టీలు బీసీలకు బీసీ మైనారిటీలకు చేసిన వాగ్దాన భంగం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మైనారిటీలను ప్రభుత్వాలు వ్యవ స్థాగతంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన మైనారిటీలకు తగిన రిజర్వేషన్లు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా వారు ప్రస్తావించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి లు వట్టే జానయ్య యాదవ్, గంగాధర్ లిం గాల, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, రాష్ట్ర నాయకులు రంగన్న పాల్గొన్నారు.




