3 April, 2026 | 2:10 AM

అధికారుల నిర్లక్ష్యంతో భారీ నష్టం

03-04-2026 12:30 AM

రూ.2,71,000/- ల రికార్డు ధర పలికిన వెల్గటూర్ పంచాయతీ వారసంత టెండర్

ధర్మపురి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యంతో వెల్లటూరు గ్రామపంచాయతీ భారీ ఆధాయానికి భారీనష్టం వాటిల్లింది. గత మార్చిలో వెల్గటూర్ వారసంతకు టెండర్ ను ఆహ్వానిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పత్రిక ప్రకటన జారీ చేశారు. వేళం పాటలో పాల్గొనేవారు పదివేల రూపాయలు గ్రామ పంచాయతీ పేరిట డీడీ తీసి టెండర్ లో పాల్గొనాలనీ సూచించారు.

మొదటి సారి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో టెండర్ నిర్వహణను వాయిదా వేసి, మరల పత్రిక ప్రకటన జారీ చేశారు. దీనితో సోమవారం వేళం పాట నిర్వహణ గ్రామ సర్పంచ్ బండమీది కవితగోపి అధ్యక్షతన కొనసాగింది. వెల్గటూరు మండల ఎంపీఓ దొంగ కృపాకర్ సైతం ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. టెండర్ లో ముగ్గురు పాల్గొనగా పదవ వార్డు సభ్యులు ఎనగందుల నరేష్ సైతం గ్రామపంచాయతీ పెట్టిన నిబంధనలను పాటించి వేలంపాటలో పాల్గొన్నారు.

గతంలో ఎన్నడులేని విధంగా రికార్డు ధరకు రూ.2లక్షల 71 వేలకు పదో వార్డు సభ్యులు ఎలగందల నరేష్ టెండర్ ను దక్కించుకున్నారు.అంతేకాకుండా గ్రామపంచాయతీకి టెండర్ నిర్వహణ కోసం మొదటి దఫాలో చెల్లించాల్సిన రూపాయలను సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే పంచాయతీరాజ్ అధికారులు టెండర్ దక్కించుకున్న వార్డు సభ్యునికి షాక్ ఇచ్చారు.

ప్రజాప్రతినిధులు వేలంపాటలో పాల్గొనరాదంటూ, అది పంచాయతీరాజ్ చట్టవిరుద్దo అంటూ అధికారులు తేల్చిచెప్పారు. దీనితో వార్డు సభ్యుడు ఎనగందుల నరేష్ అక్కడి నుండి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అధికారుల నిర్లక్ష్యపు టెండర్ నిర్వహణ వల్ల బుధవారం జరిగిన వారసంత వలన గ్రామ పంచాయతీకి వచ్చే ఆధాయం రూ. 10,000/- ల నష్టం వాటిల్లింది.

టెండర్ అంశంపై విచారణ చేపడుతాం

వెల్గటూర్ వారసంత టెండర్ అంశంపై విచారణ చేపడుతాం. అనివార్య కారణాల వల్ల టెండర్ దారుడు తప్పుకుంటే రెండవ స్థానంలో పోటీలో ఉన్న వ్యక్తికి టెండర్ హక్కులు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఆధాయానికి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతాం.

 దొండ కృపాకర్, ఎంపీవో 

టెండర్ విషయంలో అధికారుల అన్యాయం 

టెండర్ విషయం లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అన్యా యం చేశారు. టెండర్ లో పాల్గొనేందుకు పదివేలు గ్రామ పంచాయతీకి చెల్లించి న. వేళం పాటలో నేరుగా పాల్గొన్నప్పుడు ముందే అధికారులు పాల్గొన వద్దని చెప్పితే ఆగిపోదును. కానీ అధికారులు అలా చెప్పకుండా టెండర్ దక్కిం చుకున్న అనంతరం నాకు టెండర్ ఇవ్వరాదంటూ అధికారులు మాటమా ర్చారు. టెండర్ నాకు ఇప్పించి అధికారులు న్యాయం చేయాలి.

 ఎనగందుల నరేష్, టెండర్ దారుడు