15 June, 2026 | 10:21 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కర్మన్‌ఘాట్ ఆలయానికి భారీగా కానుకలు

24-03-2026 12:13 AM
  1. 145 రోజులుగా వచ్చిన ఆదాయం రూ, 63.84 లక్షలు 

కలకలం రేపిన నకిలీ కరెన్సీ 

ఎల్బీనగర్, మార్చి 23: ప్రసిద్ధ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో సోమవారం ఉద యం హుండీలను దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, భక్తుల సమక్షంలో లెక్కించారు. ఆలయానికి సంబంధించి 145 రోజులుగా హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం రూ.63,84,446 ఆదాయం వచ్చింది. ఇందులో విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయి.

67 యూఎస్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 1 మలేషియా రింగిట్, 120 అరబ్ దిర్హాన్లు, 10 యుకే పౌండ్స్, 100 బంగ్లాదేశ్ టంకాలు, 20 శ్రీలంక రుపీస్, 50 నేపాల్ రూపీస్ వచ్చాయి. హుండీల లెక్కింపులో దేవాదాయ శాఖ పర్యవేక్షకులుగా వెంకట్ ప్రేమ్ కుమార్ రావు,  ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి జనుంపల్లి, కుకునూరి గోపాల్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

హుండీలో నకిలీ నోట్లు ప్రత్యక్షం 

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదులో నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయి. రూ, 100, రూ, 200, రూ, 500 కరెన్సీ Childrens Bank పేరుతో ఉన్న నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.