కేసీఆర్ అంటే నమ్మకం
04-05-2024 12:05 AM
ఫీర్జాదిగూడ జక్కా వెంకట్‌రెడ్డి
మేడిపల్లి, మే 3 (విజయక్రాంతి): బీఅర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంటే నమ్మకమని ఫీర్జా దిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి పేర్కొన్నా రు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్య ర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా శుక్రవారం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారి రవీందర్, యడవల్లి రఘువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




