ఖమ్మం గెలుపు చరిత్రలో నిలవాలి
కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలి
బీఆర్‌ఎస్ అభ్యర్థ నామా నాగేశ్వరరావు
ఖమ్మం, మే 3 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా పోని కరెంట్ అందించారనీ, ప్రస్తుతం కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఖమ్మం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ గెలుపు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలని చెప్పారు. శుక్రవారం ఖమ్మంలోని బీఆర్‌ఎస్ భవన్లో కార్పొరేషన్లోని వివిధ డివిజన్ల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి నామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామా సాధించబోయే విజయం చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. బీఆర్‌ఎస్ గెలుపులో కార్యకర్తలదే ప్రధాన పాత్ర చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని కేవలం ౫ నెలలల్లోనే గుర్తించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణతో పాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.




