ఎంబాపె డబుల్.. నాకౌట్‌లో ఫ్రాన్స్
24-06-2026 12:00 AM
ఫిలడెల్ఫియా, జూన్ 23 : సాకర్ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్ నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ చేయడంతో ఇరాన్‌ను 3 తేడాతో చిత్తు చేసింది.వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంబాపె 14, 54వ నిమిషాల వద్ద రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలోనే సరికొత్త ఘనత సాధించాడు. మూడోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న ఎంబాపె ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.జర్మనీకి చెందిన మిరస్లావ్ క్లోజ్ (16) రికార్డును సమం చేశాడు. ఎంబాపెకు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఫాన్స్ తరఫున ఔస్మనె డెంబెలె మరో గోల్ చేశాడు. దీంతో రెండు విజయాలతో ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కు చేరుకుంది.






