సెనెగెల్‌ను నిలువరించిన నార్వే
24-06-2026 12:00 AM
రౌండ్ ఆఫ్ 32లోకి ఎంట్రీ
న్యూయార్క్ , జూన్ 23 : ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే మరో విజయాన్ని అందు కుం ది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 3 గోల్స్ తేడాతో సెనెగెల్‌ను ఓడించింది. నార్వేకు ఇది వరుసగా రెండో విజ యం. దీంతో రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. నార్వే స్టార్ ప్లేయర్ హాలాండ్ ఈ విజ యంలో కీలక పాత్ర పోషించాడు. 48, 58వ నిమిషాల్లో గోల్స్ చేసి నార్వేను గెలిపించా డు.
హాలాండ్ తన చివరి 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 24 గోల్స్ చేశాడు. ప్రతి మ్యాచ్ లో కనీసం ఒక గోల్ సాధించగా.. మొత్తంగా 52 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 59 గోల్స్ చేశాడు. కాగా 43వ నిమిషంలో నార్వే ప్లేయ ర్ పెడెర్సన్ ఒక గోల్ కొట్టాడు. ఇక సెనెగల్ తరపున ఇస్మాయిలా ౨ గోల్స్ సాధించాడు.






