జీఆర్‌పీఎల్‌లో మెరిసిన హైదరాబాద్ అల్బట్రాస్
హైదరాబాద్, జూన్ 23 : ఐపీఎల్ తరహాలో ప్రొఫెషనల్, అమెచ్యూర్ గోల్ఫర్ల కో సం నిర్వహిస్తున్న గోల్ఫ్ రెండెజౌస్ ప్రో-యా మ్ లీగ్ (జీఆర్ పీఎల్)లో హైదరాబాద్ అ ల్బట్రాస్ టీమ్ మెరిసింది. గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్ వేదికగా జరిగిన హైదరాబాద్ లెగ్ పోటీల్లో అల్బట్రాస్ విజేతగా నిలి చింది. కోటి రూపాయల ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆరు నగరాలకు చెంది న ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అహ్మదాబాద్ ఏసెస్, హైదరాబాద్ అల్బట్రాస్, ఢిల్లీ రాయల్స్, బెంగళూరు ఈగల్స్, కోలార్ జియోనర్స్, గురుగ్రామ్ టైటాన్స్ బరిలో ఉన్నాయి. సొంతగడ్డపై సమిష్టిగా రాణించిన హైదరాబాద్ టీమ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండో స్థానంలో అహ్మదాబాద్ ఏసెస్, మూడో స్థానంలో ఢిల్లీ రా యల్స్ నిలిచాయి. హైదరాబాద్ లెగ్ ను ఆన్‌లైన్‌లో పదివేల మందికి పైగా వీక్షించారనీ, లీగ్‌కు ఆదరణ మరింత పెరుగుతండ డంపై జీఆర్ పీఎల్ ఫౌండర్ దినేశ్ ఠాకూర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఉన్న అత్యుత్తమ గోల్ఫ్ కోర్సుల్లో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే ఓవరాల్ స్టాండింగ్స్‌లో అహ్మదాబాద్ ఏసెస్ టాప్ ప్లే స్‌లో ఉండగా హైదరాబాద్ టీమ్ రెండో స్థా నంలో కొనసాగుతోంది. లీగ్‌లో తర్వాతి లెగ్ బెంగళూరులో జూలై 24న జరుగుతుంది.






