శ్రీరామ్‌నగర్ రహదారి అభివృద్ధికి చర్యలు
సురంగల్ నుంచి శ్రీరామ్‌నగర్ వరకు రోడ్డుపై మట్టి పోయించిన సర్పంచ్ గీత మహిపాల్
మొయినాబాద్,(విజయక్రాంతి): సురంగల్ నుంచి శ్రీరామ్‌నగర్ వరకు ఉన్న రహదారిపై ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శ్రీరామ్‌నగర్ సర్పంచ్ గీత మహిపాల్ ఆధ్వర్యంలో రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలు, అసమతల ప్రాంతాలను పూడ్చేందుకు మట్టిని పోయించి చదును చేయించారు.
వర్షాల కారణంగా రహదారి దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో సర్పంచ్ గీత మహిపాల్ స్పందించి పనులు ప్రారంభించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడకుండా రహదారిని తాత్కాలికంగా సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు.
గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ గీత మహిపాల్ తెలిపారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రహదారిపై మట్టి పోయించి చదును చేయడంతో వాహనదారులు, స్థానికులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






