ఏజెన్సీ ప్రాంత సమగ్రాభివృద్ధికి చర్యలు
- ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
- మంత్రి సీతక్క నేతృత్వంలో సీఎంను కలిసిన ఎస్టీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపైన ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై మం త్రి సీతక్క నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆది వాసీ, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చా రు. త్రాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చునన్నారు. చెక్ డ్యామ్‌లు, రహదారుల నిర్మాణం కోసం అటవీశాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తా నన్నారు.
ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజప్తికి సీఎం సా నుకూలంగా స్పందించారు. అటవీశాఖ అ భ్యంతరాల వల్ల రహదారుల మరమ్మత్తులు ఆలస్యం అవుతాయని, కొన్ని చోట్ల కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
వీలైనంత త్వర గా వీటిపైన నిర్ణయం తీసుకోవాలని అటవీశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆది వాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు.






