14 April, 2026 | 3:03 AM

ప్రాణాలను నిర్లక్ష్యం చేయకండి

14-04-2026 12:45 AM

మానకొండూరు, ఏప్రిల్ 13(విజయక్రాంతి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, కరీంనగర్ జిల్లా పో లీసు శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో కరీంనగర్ జిల్లా తి మ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కా ర్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డా క్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కలెక్టర్ చిత్రా మి శ్రా, కమిషనర్‌గౌస్‌ఆలంపాల్గొన్నారు.

చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి

 ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ జీవితాలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గ్రామసభల్లో భద్రతపై చర్చించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల ఛిన్నాభిన్నమైన కుటుంబాల గాథలు వింటే మనసు కలచివేస్తోందని అన్నారు. సర్పంచులు తమ గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలని సూచించారు.

హెల్మెట్ ధరించడం తప్పనిసరి: సిపి గౌస్ ఆలం

సిపి గౌష్ ఆలం మాట్లాడుతూ, జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు.  

కన్నీళ్లు పెట్టించిన బాధితుల గాథలు

ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధితులు వేదికపై తమ ఆవేదనను పంచుకున్నారు. వారి మాటలు సభికులను కంటతడి పెట్టించాయి. గ్రామ సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ, తమ గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంచుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ తరుపున, ఎమ్మెల్యే చేతులమీదుగా పలువురికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.