నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): నగర వ్యాప్తంగా ప్రతి డివిజన్ లో ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మా పాలకవర్గం పని చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరంలోని 28 వ డివిజన్ కిసాన్ నగర్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ బాస్కర్ నాయక్ తో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన 25 లక్షల సాధారణ నిధులతో ఎస్ డబ్ల్యూజీ పైపులైన్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి... పనులు ప్రారంభించారు.
ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడు తూ.... కరీంనగర్ నగరాన్ని ఆదర్శంగా దీర్చిదిద్దడమే ప్రధాన ద్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామని అన్నారు. డ్రైనేజీ సమస్యలకు పరిష్కారంగా అధునాతన పద్ధతిలో ఎస్ డబ్ల్యూజీ పైపులైన్ డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
దీనివల్ల మురుగు నీటి సమస్య శాశ్వతంగా తోలగడంతొ పాటు ఇరుకు గల్లిల్లో రోడ్డు విస్తరించడం... దుర్వాసన, దోమల బెడద ఉండదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారం, మార్గదర్శకత్వంలో కరీంనగర్ నగరాన్ని మరింత సుంధరంగా తీర్చిదిద్ది... ప్రజలకు కావల్సిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ సోమిడి వేణు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




