15 April, 2026 | 7:29 AM

ప్రైవేటు వాహనాల కట్టడికి చర్యలు

30-05-2025 12:00 AM
  1. పోలీసులకు ఫిర్యాదు.. 

ఖానాపూర్ బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు: నిర్మల్ డిపో మేనేజర్ పండరి వెల్లడి

ఖానాపూర్, మే ౨౯ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ డిపో మేనే జర్ పండరీ అన్నారు. ఈ మేరకు గురువా రం విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన బాజాప్త... బస్టాండ్‌కు అడ్డంగా... అన్న శీర్షికకు స్పందించారు.  స్థానిక సిబ్బందిని అప్ర మత్తం చేసామని, దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

త్వరలోనే బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ నిర్మాణం, మూత్రశాలల్లో తగు వసతులు కల్పిస్తామన్నారు. ఖానాపూర్ నుంచి ప్రతిరోజు ఉదయం 5:15 నిమిషాలకు హైదరాబాద్ రాజధానికి బస్సు సర్వీసు త్వరలోనే ప్రారంభిస్తామని, అందుకోసం ఉన్నతా అధికారులకు నివేదిక పంపించినట్లు డీఎం వెల్లడించారు.