29-05-2025 04:09:02 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) నటిస్తున్న ''హరి హర వీరమల్లు'' చిత్రం(Hari Hara Veera Mallu) జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. బిజీగా ఉన్నప్పటికీ ఆయన రాత్రి 10 గంటలకు డబ్బింగ్ ప్రారంభించి నాలుగు గంటల్లోనే పూర్తి చేశారని నిర్మాతలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. "పవర్ స్టార్మ్ కోసం సిద్ధంగా ఉండండి. జూన్ 12న థియేటర్లలో కలుద్దాం" అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 'హరి హర వీర మల్లు: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' జూన్ 12న విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్‌జీత్, జిషు సేన్‌గుప్తా, సునీల్, నాసర్, కబీర్ సింగ్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(Oscar winner MM Keeravani) సంగీతం అందించారు. హరి హర వీర మల్లు నుంచి ఇప్పటికే పాటలు విడుదలయ్యాయి. బుధవారం విడుదలైన తాజా ట్రాక్ “తార తార నా కళ్ళు... వెన్నెల పూత నా ఒళ్లు” కూడా శ్రోతల నుండి బలమైన ప్రశంసలను అందుకుంది. 'హరి హర వీర మల్లు' సాంగ్స్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.