రాయినిగూడెంలో వైద్య శిబిరం
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాయని గూడెం గ్రామంలో శనివారం గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో నిక్షయ్ శివీర్ ఎక్స్రే క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని, ఆల్కహాల్ తాగే వారిని, పొగ త్రాగే వారిని ప్రస్తుతం మందులు వాడుతున్న వారి వివరాలను ముందస్తుగా గుర్తించి 65 మంది వ్యక్తులకు ఎక్స్ రే తీయడం జరిగిందన్నారు. ఎవరికైనా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ఈ పరీక్ష ద్వారా గుర్తించడం జరుగుతుంది అని తెలిపారు.
క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఆరు నెలల పాటు మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, తగ్గినప్పుడు రక్తపు సారికలు పడడం, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా తెమ్మడ పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఒక్కోసారి కెమెరా పరీక్షలు నిర్ధారణ కాకపోతే ఎక్స్ రే పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. అందరూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.






