7 May, 2026 | 2:42 AM

అనుమతి లేని క్లినిక్‌లపై వైద్యాధికారుల కొరడా

07-05-2026 01:51 AM

మేడ్చల్, మే 6(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అనధికారికంగా నడుస్తున్న క్లినిక్‌లపై వైద్యాధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి ఉమా గౌరీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో పలు క్లినిక్‌లను తనిఖీ చేసి అనేక లోపాలు గుర్తించారు. అర్హత కలిగిన వైద్యులు కూడా లేరు. పేషెంట్ల నుంచి ప్యాకేజీల రూపంలో ముందుగానే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారుల తనిఖీలో తేలింది.

దీంతో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, అలోపతి చట్టం 2010 ప్రకారం నాలుగు క్లినిక్‌లను సీజ్ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కేవలం రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదని, నిబంధనలు ఉల్లంఘించి క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి ఉమాగౌరీ హెచ్చరించారు.తనిఖీలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, డాక్టర్ పవన్, డిప్యూటీ డెమో వసంత పాల్గొన్నారు.