27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

బదిలీలు పారదర్శకంగా ఉండాలి

07-05-2026 01:51 AM

ఉద్యోగుల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత  

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వి వాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, దంపతులు ఒకే చోట పనిచేసే స్పౌస్ కేసులు వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలన్నారు.

బుధవారం సచివాలయంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీజీ టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ, దివ్యాంగుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను ఆదర్శంగా నిలిచే విధంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం చాలా సేవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించేం దుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఫిర్యాదుల  పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్, గురుకులాల్లో అవసరమైన సిబ్బంది సమతుల్యతను కాపాడాలని అన్నారు. మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు, సీనియర్ ఉ ద్యోగులకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూ చించారు. 190 జీవో అమలులో సమస్యలున్నాయన్నారు. ఉద్యోగులకు అన్యా యం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి శారద, టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అదనపు అధికారి రాజేందర్‌రెడ్డి, నటరాజ్, వెంకన్న, లింగారెడ్డి, బాబు, వేణుగోపాల్, దివ్యాంగులశాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.