3 April, 2026 | 5:59 PM

రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై సీఎం చర్చలు

03-04-2026 04:15 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌  జయతీర్థ చారి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.