12 April, 2026 | 2:29 AM

ఆందోళన కలిగిస్తున్న మానసిక సమస్యలు

12-04-2026 12:41 AM
  1. ఏటా 13వేలకు పైగా ఆత్మహత్యలు
  2. కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సదస్సు

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): నానాటికీ యువతలో మానసిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐఏఎస్ అధికారి ఎ. దేవసేన అన్నారు. మానసిక సమస్యలు, చికిత్సలు వంటి పలు అంశాలపై కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, క్లినికల్ సైకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీపీఎస్‌ఐ) సహకారంతో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ సమన్వయ 2026 సదస్సును ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా సోషల్ మీడియా విని యోగం పెరిగిన తర్వాత విద్యార్థులు చెడుధోరణిలో వెళ్తున్నారని నివేదికలు చెబు తు న్నాయి. సోషల్ మీడియా ఎంత వరకు వాడుకోవాలో అంతే వరకు వాడాలని, చెడుపై దృష్టి పెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం చిన్నప్పటి నుంచే పునాదులు వేయాలని సూచించారు.అంతేకాకుండా ఇటీవల మనం చూస్తున్న క్రైంలో ఎక్కువగా ఆత్మహాత్యలు ఆత్మనూన్యత భావనకు లోనవారే చేసుకుంటున్నారు. ఏదైన సమస్య వచ్చినప్పుడు నలు గురితో మాట్లాడితే దానికి సరైన సమాధానం దొరికే అవకాశం ఉంటుంది.

అంతేకానీ చిన్నపాటి తప్పులకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసు కోవద్దన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ క్లినికల్ సైకాలజీతో పాటు అనుబంధ విభాగాల నిపుణులు పాల్గొని సమగ్ర, ఆధునిక చికి త్సా విధానాలపై చర్చించారు.ఇది ఇప్పుడిప్పు డే వస్తున్న వైద్యులకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.

యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి బహుళశాఖల సమన్వయం, రోగి కేంద్రిత సేవలు అత్యవసరమన్నారు.ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ షణ్ముఖి మాట్లాడుతూ దేశంలో యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరు గుతున్న నేపథ్యంలో ఈ సదస్సు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (2022 గణాంకాల ప్రకారం ప్రతి ఏడా ది 13వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 శాతం యువకులు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదు ర్కొంటున్నట్లు అంచనా అని పేర్కొన్నారు.అకడమిక్ నిపుణులు డాక్టర్ సరోజ్ ఆర్య, డాక్టర్ భాస్కర్ నాయుడు కూడా ప్రసంగిస్తూ ఆధారపూర్వక వైద్యం, సమిష్టి విధానాల ప్రాము ఖ్యతను వివరించారు. ‘సమన్వయ’ అనే భావన అంటే సమతుల్యత, సమగ్రత ఈ సదస్సు ప్రధాన అంశంగా నిలిచింది.

ఒక్క విధానంపై ఆధారపడకుండా, డిప్రెషన్, ఆందోళన, సోమాటిక్ మరియు డిసోసియేటివ్ సమస్యల వంటి క్లిష్టమైన యువ మానసిక ఆరోగ్య సమస్యలకు అనుకూలంగా సమగ్ర చికిత్సా విధానాలు అవసరమని నిపుణులు సూచించారు. ‘యువన్’ (యువ మానసిక ఆరోగ్యం)పై కేంద్రీక రించిన ఈ సదస్సులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం, మ ణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తోపాటు వివిధ హాస్పిటల్స్ నుంచి వచ్చిన నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని కిమ్స్ నిర్వాహక బృందం సభ్యులు డాక్టర్ షణ్ముఖి, డాక్టర్  హేమలత, డాక్టర్ అదితి దేవి సమర్థవంతంగా నిర్వహించారు. సీపీఎస్‌ఐ ప్రతినిధులు డాక్టర్ జమునా రాజేశ్వరన్, డాక్టర్ ఎన్. సురేష్ కుమార్ సహకారం అందించారు.