11 April, 2026 | 3:49 AM

అన్నవాహిక క్యాన్సర్‌పై అంతర్జాతీయ సదస్సు

11-04-2026 01:56 AM

మాదాపూర్‌లోని ది వెస్టిన్ హోటల్‌లో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): అత్యంత ప్రమాదకరం, ఆలస్యంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన అన్నవాహిక/ అన్న నాళం క్యాన్సర్ అంతర్జాతీయ సదస్సు మాదాపూర్‌లోని ది వెస్టిన్ హోటల్‌లో శుక్ర, శనివారాల్లో జరగనుంది. బసవతారకం హా స్పిటల్ సిల్వర్ జూబిలీ సందర్భంగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఈసోఫాగస్ (ఐఎస్డీఈ), బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఐఏఎస్‌ఓ అధ్యక్షులు డాక్టర్ టీ సుబ్రహ్మణ్యేశ్వరరావు మా ట్లాడుతూ ఈ సదస్సును నందమూరి బాలకృష్ణ ప్రారంభిస్తారని తెలిపారు.ఈ సదస్సు భారతదేశంలో మొదటిసారి జరుగుతుందన్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 మందికి పైగా ఆంకాలజిస్టులు (క్యాన్సర్ నిపుణులు) పాల్గొంటారన్నారు.

కెనడా, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి నిపుణులు, భారతదేశంలోని ప్రముఖ వైద్యులు, పరిశోధకులతో తాజా పురోగతులను పంచుకోను న్నారని చెప్పారు.ఈ వ్యాధి ఈసోఫాగస్ (అన్నవాహిక/ అన్ననాళం) లోపలి పొరలో ప్రారంభమవుతుందన్నారు. దీనికి ప్రధాన కారణాలు.. పొగ తాగడం (టొబాకో), మద్యం సేవనం, జీఈఆర్డీ (గ్యాస్ట్రో-ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్), అధిక బరువు (ఒబెసిటీ), పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ టాప్ టెన్లో ఒకటన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దీని కేసులు పెరుగుతు న్నాయని చెప్పారు.ఈ వ్యాధి వల్ల మింగడం కష్టమవుతుందన్నారు. పోషణపై ప్రభావం పడుతుందన్నారు. జీవన నాణ్యత తగ్గుతుందన్నారు. దీని నివారణకు ప్రమాద కారకా లను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, చికిత్స, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ/ఇమ్యూనోథెరపీ ఇప్పటి ఆధునిక నిర్ధారణ పద్ధతులు, మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నాలజీలు చికిత్సను మరింత సులభంగా అందుబాటులోకి తెస్తున్నాయని పేర్కొన్నారు.

నగరంలో ఈ సద స్సు నిర్వహించడం ద్వారా ప్రపంచ స్థాయి నిపుణుల జ్ఞానం భారతీయ వైద్యులకు, రోగులకు నేరుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదస్సులో అన్నవాహిక /అన్ననాళం క్యాన్సర్ చికిత్సలో మార్పులు తీసుకొస్తున్న అత్యాధునిక సాంకేతికతలు, పురోగతులను ప్రదర్శించనున్నారన్నారు.ఈ సందర్భంగా టాటా మెమోరియల్ హాస్పిటల్ (ముంబై) డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ మాట్లాడుతూ ఈ సదస్సు భారతదేశంలో ఆంకాలజీ రంగంలో పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు.

ఇటువంటి వేదికలు అత్యాధునిక జ్ఞాన మార్పిడికి అవకాశం కల్పిస్తాయన్నారు.ఈ కాన్ఫరెన్స్‌కు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హాజరు కానున్నారు. వీరిలో ఐఎస్డీఈ అధ్యక్షుడు, అప్పర్ జీఐ క్యాన్సర్ ప్రోగ్రామ్ మెక్గిల్ వర్శిటీ (కెనడా) డైరెక్టర్ ప్రొఫెసర్ లోరెన్జో ఫెర్రి, నేషనల్ క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్ (జపాన్) డాక్టర్ కెన్ కాటో,  హిరోయుకి డైకో, ఎడ్వర్డ్ చెయోంగ్ (సింగపూర్), డాక్టర్ కుయాంగ్ డుయోంగ్ (ఆస్ట్రేలియా), డాక్టర్ స్టీవెన్ లిన్ (యూఎస్‌ఏ), బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ హెడ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సెంటిల్ రాజప్ప పాల్గొన్నారు.