12 April, 2026 | 2:29 AM

‘పార్కిన్సన్’ భారీ భారం మోపుతుంది

12-04-2026 12:43 AM
  1. వ్యాధి వ్యక్తుల జీవితాలను మారుస్తుంది

డాక్టర్ గురు ఎన్ రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి):2026,ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్ డే సందర్భంగా పేషెంట్ కనెక్ట్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని కాంటినెంటల్ హాస్పి టల్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్కిన్సన్ బాధితులు, వారి కుటుంబసభ్యులు, న్యూరాలజిస్ట్స్, న్యూరోసర్జన్స్, రిహాబిలిటేషన్ నిపుణులతో పాటు.. పోషకాహార నిపుణులతో కూడిన వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పార్కిన్సన్ వ్యాధి, దాని నిర్వహణ, చికిత్సా విధానాలు, పోషకాహార అవసరాలు, రిహాబిలిటేషన్ సపోర్ట్‌పై నిపుణుల అభిప్రాయాలను సమగ్రంగా పం చుకునే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మెన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో గత కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధికి చికిత్స తీసుకున్న పేషెంట్స్, వారి కుటుంబసభ్యులందరినీ ఇలా ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

పే షెంట్ పట్ల కాంటినెంటల్ హాస్పిటల్స్ మేనేజ్ మెంట్, డాక్టర్స్, ఇతర ఉద్యోగులు తీసుకునే శ్రద్ధ.. చాలా సున్నితంగా ఉంటుందన్నారు. ఆ నమ్మకమే ఇవాళ కాంటినెంటల్ హాస్పిటల్స్ ను నెంబర్ వన్ స్థానంలో నిలిపిందన్నారు. ఈ పార్కిన్సన్ వ్యాధికి వివిధ విభాగాల డాక్టర్ల వైద్య సేవలు అత్యవసరం. కాంటినెంటల్లో ప్రతి కేసును న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్స్, రేడియాలజిస్టులు, జెనెటిసిస్టులు కలిసి చర్చించి, చికిత్సా ప్రణాళికపై అన్ని కోణాల్లో విశ్లేషణ చేసి, తుది నిర్ణయాన్ని పేషెంట్, వారి కుటుంబంతో పంచుకుంటారు. ఇటువంటి పద్ధతి ఎక్కడా లేదు.

కాంటినెంటల్ హాస్పిటల్స్ మూవ్‌మెంట్ డిజార్డర్ నిపుణులు ప్రతి రోగి వారి కుటుంబంతో గంటల తరబడి గడిపి వారికి మార్గదర్శకత్వం అందిస్తారు, అని డాక్టర్ రెడ్డి తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూవ్‌మెంట్ డిజార్డర్ నిపుణుడు డాక్టర్ చక్రధర్ రెడ్డి, పార్కిన్సన్‌కు సంబంధించిన విస్తృత లక్షణాలను వివరించి, ఈ వ్యాధిని సమగ్రంగా ఎలా నిర్వహించాలో వివరించారు.

సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంకే సింగ్ మాట్లాడుతూ సరైన నిర్ధారణ, మల్టీడిసిప్లినరీ కేర్, కొత్త ఔషధాలు, ఇమ్యూనోథెరపీలు, న్యూరో మోడ్యులేటింగ్ చికిత్సల ద్వారా పార్కిన్సన్‌ను తక్కువ సమస్యలతో సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు.పార్కిన్సన్ చికిత్సలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) పాత్రను వివరించి,

ఈ చికిత్స పొందిన రోగులకు కాంటినెంటల్ హాస్పిటల్స్‌లోఉన్న అధునాతన న్యూరోసర్జరీ సదుపాయాల వల్ల అద్భుత ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు ఎండోస్కోపిక్ న్యూరో సర్జరీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ హృషీకేష్ సర్కార్.సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డా. శివానంద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ విఘ్నేష్ సయీరాజన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ కొడూరి,

కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. సుమతి జారుగు, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ నిపుణుడు డాక్టర్ బబీష్ చక్కూ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రమేష్ రెడ్డి, పోషకాహార నిపుణురాలు డాక్టర్ అనురాధ రెడ్డి, చీఫ్ డైటీషియన్ ఐశ్వర్య రాజ్ తదితరులు ఈ కార్యక్ర మంలో పాల్గొని రోగులతో పరస్పరం మాట్లాడారు.

కాంటినెంటల్‌లో పాశ్చాత్య దేశాల స్థాయిలో ఉన్న అద్భుత రిహాబిలిటేషన్ సదుపాయాలు, పూల్ థెరపీ, రోబోటిక్ రిహాబ్ వంటి సేవలు పార్కిన్సన్ రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.రిహాబ్ వైద్యులను ప్రారంభ దశ నుంచే చేర్చడం ద్వారా, న్యూరోసర్జన్స్, రేడియాలజిస్టులు, డైటీషియన్స్, పేషెంట్ సపోర్ట్ గ్రూపులతో కలిసి సమగ్ర బహుశాఖ వైద్య సేవలను అందిస్తున్నారు.

జీవనశైలి మార్పులు, వ్యాయామాలు, ఫిజికల్ థెరపీ, బాలెన్స్ చేసుకోవడం... ఇవన్నీ కూడా పార్కిన్సన్ చికిత్సలో ముఖ్యమైన అంశాలు. అలాగే, ఆందోళన,డిప్రెషన్ తగ్గించడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత పద్ధతులు ప్రభావవంతమని నిరూపితమయ్యాయి.ఈ అన్ని విధానాలను కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎల్లప్పుడు తమ పేషెంట్స్ కు అందించడంలో ముందువరుసలో ఉంటుంది.