13-12-2025 05:37:45 PM
హైదరాబాద్‌లో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ
హైదరాబాద్: ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ(Football legend Messi) హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport) చేరుకున్న మోస్సీ అక్కడి నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయల్దేరారు. మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతించారు. మెస్సీ రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫలక్ నుమా ప్యాలెస్ క చేరుకున్నారు. మెస్సీని కలవాలంటే క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేశారు. ఫలక్ నుమా ప్యాలెస్ దగ్గర భారీ బదోబస్తు ఏర్పటు చేశారు.