calender_icon.png 13 December, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ బానిసైన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం

13-12-2025 04:42:22 PM

హైదరాబాద్: కూతురు డ్రగ్స్(Drug Addict) బానిసకావడంతో ఓ తల్లి(Motherఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో చోటుచేసుకుంది. ఈగల్ చీఫ్ రవికృష్ణ(Eagle Chief Ravikrishna) జీజీహెచ్ కి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఇన్‌స్టాగ్రామ్ లో కొందరు తన కూతుర్ని ట్రాప్ చేశారని తల్లి ఆరోపించింది. డ్రగ్స్ కి బానిసగా మార్చి వేధిస్తున్నారని తల్లి వాపోయింది. డ్రగ్స్ తీసుకోవడం ఆపమని, తల్లిదండ్రులు కూతురు పోన్ లాక్కున్నారు. ఆవేశంలో తల్లిదండ్రులపైనే కూతురు దాడి చేసింది. తట్టుకోలేక మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకుని తల్లి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.