calender_icon.png 20 February, 2026 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో చిరుత సంచారం

20-02-2026 11:57:32 AM

  1. వేములవాడ రూరల్ మండల పరిధిలో గల ప్రజలు అప్రమత్తం ఉండాలి .
  2. వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం
  3. చిరుత అడుగులను గుర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు
  4. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లి లో చిరుత సంచారం.

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ అర్బన్ మండల పరిధిలో గల హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకి చెందిన పొలం దగ్గర కట్టేసిన ఆవు దూడ పై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణ(Vemulawada Town) శివారులోని హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం వుంది కాబట్టి వేములవాడ రూరల్ పరిధిలో గల గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.ఈ సందర్బంగా ఎస్ ఐ వెంకట్రాజం మాట్లాడుతూ ప్రజలు పొలం వద్దకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఉండాలి అని,పొలం వద్ద పశువులను రాత్రి పూట ఉండకుండా ఇంటి వద్ద కట్టేసుకోవాలి అని, రాత్రి పూట పొలం వద్దకు వెళ్లకుండా ఉండాలి అని, చిరుత సంచారం గుర్తిస్తే సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.