18 July, 2026 | 12:10 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

నిద్రమత్తులో మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు

01-06-2026 12:48 AM
  1. స్నేహిత హిల్స్‌లో ఏడాదిగా పైపులైన్‌కు మరమతులు చేయని సిబ్బంది
  2. నడిరోడ్డుపై తేలిన పైపుతో ప్రయాణానికి కాలనీవాసుల ఇబ్బందులు

రాజేంద్ర నగర్ మే 31 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు గత ఏడాది కాలంగా నిద్రమత్తు వదలడం లేదు. స్నేహిత హిల్స్ పీరంచెరువు ప్రాంతాలకు తాగునీరు  అందించేందుకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు  స్నేహిత హిల్స్ లో 300 కె ఎల్ సామర్థ్యం గల వాటర్ ట్యాంకును నిర్మించారు. ఈ వాటర్ ట్యాంక్ కు తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైపులైను ను అధికారులు ఏర్పాటు చేశారు 

అయితే రోడ్డు  పై నిర్మించిన పైపులైను ను అధికారులు భూమి లోలోపల నిర్మించకుండా కొద్ది భాగం తవ్వి పైపులైను ఏర్పాటు చేయడంతో ఇటీవల స్నేహిత హిల్స్ లో కొనసాగుతున్న భావనల కన్స్ట్రక్షన్ టిప్పర్లు పెద్ద ఎత్తున బరువైన మట్టి రాళ్లను సరఫరా చేయడంతో రోడ్డుపై ఉన్న పైపులైను చుట్టూ మట్టి కొట్టుకుపోయి పైపులైన్ తేలింది. ఏడాది కాలం నుండి రోడ్డు పై పైపులైన్ తేలడం తో స్నేహిత హిల్స్ కాలనీవాసులు తేలిన రోడ్డు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఈ సమస్యపై పలుమార్లు కాలనీ ప్రజలు వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ కాలని వాసులు చెప్తున్నారు. 

నడి రోడ్డుపై ఉన్న పైపుతో ప్రయాణానికి ఇబ్బందులు ః ప్రతాప్ రెడ్డి స్నేహిత హిల్స్ నివాసి

స్నేహిత హిల్స్ కాలనీలో గత ఏడాదికాలంగా రోడ్డుపై మంచినీటి పైపులైను తేలి ఉండడంతో ప్రయాణానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం .కార్లు టూ వీలర్స్ లు తరచుగా ప్రమాదానికి గురవుతున్నాయి అధికారులు తక్షణమే స్పందించి పైపులైన్  కు మరమ్మత్తు చేయాలని స్నేహిత హిల్స్ కాలనీ కి చెందిన ప్రతాప రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు.