13 June, 2026 | 2:16 AM

మెక్సికో బోణీ

13-06-2026 12:00 AM

దక్షిణాఫ్రికాపై విజయం

మెక్సికో, జూన్ 12: ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు శుభారంభం చేసింది. తొలిమ్యాచ్‌లో 2- తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన మెక్సికో మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషానికే గోల్ చేసింది. సౌదీ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న క్వినోన్స్ ఆధిక్యాన్ని అందించాడు.

ఇక రెండో అర్థభాగంలో రావుల్ జిమినెజ్ మరో గోల్ చేసి ఆధిక్యంలో నిలిపాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు రెడ్ కార్డులు ఇచ్చారు. వీరిలో ఇద్దరు సౌతాఫ్రికా ప్లేయర్స్ ఉండగా, ఒకరు మెక్సికో ఆటగాడు. దీంతో దక్షిణాఫ్రికా 9 మందితోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయి తే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల కంటే, రిఫరీగా ఉన్న విల్టన్ సాంపియో హైలెట్ అయ్యాడు. అతడు ఒకే మ్యాచ్‌లో 3 రెడ్ కార్డులు చూ పించి, దక్షిణాఫ్రికా ఓడిపోవడంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించాడు. అతనికి ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇవ్వాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.