చెకియాకు దక్షిణకొరియా చెక్
13-06-2026 12:00 AM
ఎస్టాడియో, జూన్ 12: సాకర్ ప్రపంచకప్‌లో దక్షిణకొరియా బోణీ కొట్టింది. గ్రూప్- ఏలో జరిగిన రసవత్తరమైన మ్యాచ్‌లో చెకియాపై దక్షిణ కొరియా 2 తేడాతో విజ యం సాధించింది. మొదటి అర్ధభాగంలో ఏ జట్టూ గోల్ చేయలేదు. కానీ రెండో ఆర్ధభాగం మాత్రం చాలా ఉత్కంఠభరితంగా సాగింది.
రెండో భాగం మొదలైన తర్వాత చెకియా ఆటగాడు లాడిస్లావ్ గోల్ కొట్టి తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు. కాసేపటికే దక్షిణ కొరియా ప్లేయర్ హవాంగ్ బోయి మ్ గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. దీనితో ఇరుజట్లు మరో గోల్ కొట్టడం కోసం తీవ్రంగా పోరాడాయి. చివరికి మ్యాచ్ 80వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు ఓ హైన్ గ్యు గోల్ కొట్టి 2 ఆధిక్యాన్ని అందించాడు. అదనపు సమయంలోచెకియాను గోల్ కొట్టనీయకుండా అడ్డుకోవడంలో దక్షిణ కొరియా విజయవంతమైంది.






